డ్రగ్స్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది విచారణ పర్వం. కెల్విన్ కాల్ లిస్టు, వాట్సాప్ గ్రూపు చాట్ ఆధారంగా ఒక్కొక్కరు సిట్ విచారణకు హాజరు అవుతున్నారు. ఇవాళ హీరో నవదీప్ ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశం వుందట. అతని తల వెంట్రుకలు, గోర్ల నమూనాలను కూడా సేకరించే అవకాశం వుందట. అయితే నవదీప్ మీద ఇదివరలో కేసులు బుక్ అయి వున్నాయనే విషయం తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, పబ్ లో పట్టుబడటం, బోట్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం.., వంటి కొన్ని కేసుల్లో నవదీప్ నిందితుడిగా వున్నాడు.
తనకు సంబంధించిన పబ్ లో BP, LP వంటి కోడ్లతో డ్రగ్స్ డ్రింకుల్లో మిక్స్ అయి సరఫరా అవుతోందని, డ్రగ్స్ ముఠాలతో నవదీప్ కు సంబంధాలున్నట్టు, జాక్ అనే మరో వ్యక్తి సైతం ఇలాంటి డ్రింక్స్ సప్లై చేయడంలో కీలకంగా వ్యవహరించాడనే పక్కా ఆధారాలతోనే సిట్ అధికారులు నవదీప్ ను విచారించనున్నారట.