డ్రగ్స్.. 15 మంది సాఫ్ట్‌వేర్‌ల ఉద్యోగాలు పోయాయి - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్.. 15 మంది సాఫ్ట్‌వేర్‌ల ఉద్యోగాలు పోయాయి

April 7, 2022

8

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా మత్తు పదార్థాలను విక్రయిస్తూ, బీటెక్ విద్యార్థి మరణానికి కారణమైన లక్ష్మీపతిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి, అతని నేర చరిత్రను నార్కోటిక్స్ విభాగం డీసీపీ చక్రవర్తి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం డ్రగ్స్ తీసుకుంటున్న ఓ 15 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఉద్యోగాలనుంచి తీసేసిన సంఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, తాజాగా ఓ పబ్‌లో డ్రగ్స్ భాగోతం బయటపడే వరకు డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతుంది. అయితే డ్రగ్స్ పెడ్లర్ల వద్ద లభిస్తున్న ఫోన్ నంబర్లలో.. సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు, పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై ఐటీ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మత్తు పదార్థాలకు బానిసైన ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి.

అంతేకాకుండా పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల చిట్టా బయటపడుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు. టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి వద్ద నుంచి వీరు డ్రగ్స్, గంజాయి కొన్నట్టు పోలీసులు నిర్ధారించారు.