డ్రగ్స్ కేసు.. రకుల్, దీపికలకు ‘నార్కోటిక్’ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసు.. రకుల్, దీపికలకు ‘నార్కోటిక్’ నోటీసులు

September 23, 2020

Drugs case NCB summons Deepika Padukone, Rakul Preet for questioning.

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య డ్రగ్స్ మలుపు తీసుకుని ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, దీపిక పడుకొణె, మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏరోజు ఎవరి పేరు బయటకు వస్తోందోనని అందరూ భయపడుతున్నారు. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు జారీచేసింది. శ్రద్ధా కపూర్‌, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌తో పాటు తెలుగు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌కు నోటీసులు అందాయి.

డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం మూడు రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్సీబీ  నోటీసుల్లో పేర్కొంది. కాగా, సుశాంత్ కేసులో ఇప్పటికే అతని గర్ల్‌ఫ్రెండ్  రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్‌ లింకులతో సంబంధం ఉన్నట్టు బాలీవుడ్‌లో 25 మంది పేర్లను రియా వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. కాగా, ఈ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్‌లో మాదిరి సంచలనంగా మారి, తర్వాత చల్లబడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.