వర్మకు అకున్ సబర్వాల్ పంచ్..! - MicTv.in - Telugu News
mictv telugu

వర్మకు అకున్ సబర్వాల్ పంచ్..!

July 24, 2017

డైరెక్టర్ రాం గోపాల్ వర్మకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూరీజగన్నాథ్, సుబ్బరాజులను విచారించినట్లు 12 గంటల సేపు స్కూలు పిల్లలను విచారిస్తారా అంటూ వర్మ సోషల్‌మీడియా ద్వారా సిట్ అధికారులను ప్రశ్నించాడు. ఎక్సైజ్ శాఖ పేరును ప్రచారం చేసుకోవడానికి సినిమా వాళ్లను ట్రైలర్లు, టీజర్లుగా వాడుకుంటున్నారని ఆరోపించాడు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన అకున్ సబర్వాల్ స్కూలు పిల్లల పేర్లను బయటకు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాళ్లు మైనర్లు కావడంతో పేర్లు చెబితే వాళ్ల జీవితాలు నాశనం అయిపోతాయని, వాళ్ల పేర్లు ఎందుకు ఇవ్వాలని అకున్ సబర్వాల్ ప్రశ్నించారు. బాధిత పిల్లల తల్లదండ్రులను పిలిపించి చెబుతున్నామని, ఇక్కడకు రావడానికి అంగీకరించని తల్లిదండ్రులకు ఫోన్‌లో కౌన్సెలింగ్ చేస్తున్నామని సబర్వాల్ వివరించారు. చిన్న పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పబోమని అకున్ సబర్వాల్ తేల్చి చెప్పారు.సో సోషల్ మీడియాలో ప్రశ్నించిన వర్మ కు సబర్వాల్ ఇచ్చారు.