హీరో రిటర్న్స్... డ్రగ్స్ స్టార్ల ఖేల్ ఖతమేనా..? - MicTv.in - Telugu News
mictv telugu

హీరో రిటర్న్స్… డ్రగ్స్ స్టార్ల ఖేల్ ఖతమేనా..?

July 15, 2017

ఎస్… హీరో మనస్సు మార్చుకున్నాడు. సెలవులు రద్దు చేసుకున్నాడు. విలన్ల దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు. డ్రగ్స్ డొంక కదిలిచేందుకు ఎక్సైజ్‌ డీజీ అకున్‌ సబర్వాల్‌ సెలవులు రద్దు చేసుకున్నారు. అయ్యో రియల్ హీరో ను సెలవుపై పంపుతున్నారు…కేసు పనైపోయింది..నయీం కేసు లాగే చేస్తారేమో అంతా అనుకున్నారు. కానీ పబ్లిక్ డిమాండ్ తెలంగాణ సర్కార్ చెవిన పడ్డట్టుంది. వెంటనే సబర్వాల్ ను వెనక్కి పిలిపించారు. మిగతా కలుగులో దాక్కున్న డ్రగ్స్ హీరోలను బయటకు తీస్తారా? అదృశ్య శక్తుల మాట వింటారా..? తల తిక్కగాళ్ల ఆట కట్టిస్తారా..? తూ తూ మంత్రంగా విచారణ సాగిస్తారా …?గుడుంబా రహిత రాష్ట్రంగా చేసినట్టే డ్రగ్స్ రహిత టాలీవుడ్ ను చేస్తారా…?

అవున్ …అకున్ సబర్వాల్ కు ఇప్పటిదాకా ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇస్తే…డ్రగ్స్ తుట్టెను లేపుతారు. చీల్పి చెండాడుతారు. గమ్మత్తైన దెబ్బతో మత్తు వదిలిస్తారు. స్టార్స్ లో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ , థర్డ్ గ్రేడ్ అర్టిస్లులు అనే కాదు డ్రగ్ గ్రేడ్ లో ఉన్న అందరి తాటతీస్తారు.ఇందులో నో డౌట్.

దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ సెలవులు వాయిదా వేసుకుంటున్నట్లు అకున్ సబర్వాల్ వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఆయన సెలవుపై వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకు ఆయన సెలవుపై వెళ్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన వివరించారు.

ఇదే నిజమైతే డ్రగ్స్ స్టార్ల ఖేల్ ఖతం. తెరపై హీరోలను ఈ రియల్ హీరో తరిమి తరిమి వెంటాడటం పక్కా. ఈ అసలు సిసలైన డ్రగ్స్ సినిమా ఎన్ని మలుపులు తిరుగుతుందో…క్లయిమాక్స్ ఏంటో ..ఎలా ఉంటుందో …ఒక్కసారి ఊహిస్తే… ఎవరూ అంచనా వేయలేరు.. ఎందుకంటే స్క్రిప్ట్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ లవి డిఫరెంట్ మెంటలిటీస్ కదా..ఇలాగే ఉంటది మరి.. ఆల్ ది బెస్ రియల్ హీరో…సబర్వాల్ సాబ్…