కెల్విన్ తో లింకేంటీ..ఎన్నాళ్లుగా తెలుసు..? - MicTv.in - Telugu News
mictv telugu

కెల్విన్ తో లింకేంటీ..ఎన్నాళ్లుగా తెలుసు..?

July 19, 2017

పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ట్విట్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్…ఇచ్చిన టైమ్ కన్నా ముందే సిట్ ముందు హాజరయ్యాడు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. సుదీర్ఘ విచారణలో ప్రశ్నలు వర్షం కురిపించారు. డ్రగ్ వ్యాపారి కెల్విన్ తో సంబంధాలపై ఆరా తీశారు..పూరీ జగన్నాథ్‌ను విచారిస్తున్న గదిలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు మాత్రమే ఉన్నారు. సమాధానాల్ని దాటవేసే క్రమంలో ఎవిడెన్స్ ముందు పెట్టేలా అన్నింటి సిద్ధం చేసుకుని సిట్ విచారిస్తోంది.

డ్ర‌గ్స్ కేసులో డైర‌క్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం నాంప‌ల్లిలో ఉన్న ఆబ్కారీ ఆఫీసులో సిట్ బృందం పూరీని విచారించింది. డ్ర‌గ్ ముఠా నాయ‌కుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాల‌పై ఆరా తీసింది. బుధవారం ఉద‌యం 10.30 నిమిషాల‌కు అబ్కారీ ఆఫీసుకు రావాలంటూ పూరీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఇచ్చిన టైమ్ కు ముందే ఆఫీసుకు చేరుకున్నాడు. పూరీతో పాటు ఆయ‌న కుమారుడు, సోద‌రుడు, ఆయ‌న త‌ర‌పున న్యాయ‌వాది కూడా సిట్ ఆఫీసుకు వ‌చ్చారు.

హైదరాబాద్ కొకైన్‌, హెరైన్ లాంటి మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అమ్ముతున్న కెల్విన్‌తో పూరీకి ఏలాంటి సంబంధాలు ఉన్నాయ‌న్న కోణంలో సిట్ అధికారులు విచార‌ణ జ‌రిపారు. కెల్విన్‌తో పూరీ వాట్సాప్ ద్వారా సంబంధాలు కొన‌సాగించాడు. అయితే ఆ అంశాన్ని సిట్ అధికారులు ప్ర‌శ్నించారు. కెల్విన్ వ్యాట్సాప్‌లో పూరీ బ్యాంక్‌ ఆర్థిక లావాదేవీల గురించి కూడా మెసేజ్ చేసిన‌ట్లు స‌మాచారం. కెల్విన్‌కు పూరీ ఎందుకు సందేశాలు పంపాడు, వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన లావాదేవీలపై ఆరా తీశారు. ఒక‌వేళ కెల్విన్ ద‌గ్గ‌ర పూరీ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు అంగీక‌రిస్తే, అది ఆయ‌న కోస‌మా లేక అమ్మేందుకు తీసుకున్నాడా అన్న కోణంలోనూ విచార‌ణ కొన‌సాగింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలను సిట్‌ రెడీ చేసింది ఒకవేళ తమ ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తే సాక్ష్యాలను పూరీ జగన్నాథ్ ముందు సిట్ అధికారులు ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారు.

పూరి జగన్నాథ్‌ను విచారించే గదిలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు, ఓ వైద్యుడు, వీడియాగ్రాఫర్‌ను ఉన్నతాధికారులు ఏర్పాటుచేశారు. అలాగే విచారణను వీడియో ద్వారా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈవిచారణ తీరును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పరిశీలిస్తారు. అలాగే సమాధానాలను నోట్‌ చేసుకునేందుకు మరో అధికారిని ఏర్పాటుచేశారు. విచారణ తీరును లిఖిత పూర్వకంగా ‘సిట్‌’ రికార్డు చేసింది