డ్రగ్స్ కేసులో మరికొందరికి నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో మరికొందరికి నోటీసులు

July 17, 2017

డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఎక్సైజ్ సిట్ దూకుడు పెంచింది. కేసును స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా మరికొందరికి నోటీసులు పంపింపింది. వాళ్లల్లో ఎవరెవరు ఉన్నారో…?

డ్రగ్స్‌ కేసులో నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ కు నోటీసులిచ్చిన ఎక్సైజ్ సిట్‌ సోమవారం మరో రెండు కొరియర్‌ సంస్థలకు నోటీసులు పంపింది. కెల్విన్‌ చెప్పిన వివరాల ఆధారంగా రెండు కొరియర్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ను కొరియర్‌ ద్వారా ఎవరు బుక్‌ చేశారు?.. పార్శిల్‌ను ఎవరు తీసుకున్నారు? అన్న అంశాలపై ఆరా తీస్తోంది. కెల్విన్‌తో పాటు అరెస్టైన మరికొందరిని కస్టడీకి తీసుకోనుంది.

రెండో విడత నోటీసుల్లో ఎవరెవరి పేర్లు ఉంటాయోనని టాలీవుడ్ టెన్షన్ పడుతుంది. ఈ సినిమా వాళ్లతో పాటు ఇంకేవారైనా ఉంటారన్న చర్చ సర్వత్రా నడుస్తోంది.ఇక రేపో, మాపో డ్రగ్స్ కేసుల్లో అరెస్టులు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చూడాలి ఎవరెవరు అరెస్టు అవుతారో…