డ్ర‌గ్స్ కేసులో కాజ‌ల్ మేనేజ‌ర్ అరెస్ట్..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్ర‌గ్స్ కేసులో కాజ‌ల్ మేనేజ‌ర్ అరెస్ట్..!

July 24, 2017

డ్రగ్ పిక్చర్ మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు డ్ర‌గ్స్ కేసు.. హీరోయిన్ కాజ‌ల్ మేనేజ‌ర్ వైపు మ‌ళ్లింది. గంజాయి కేసులో కాజ‌ల్ మేనేజ‌ర్ రోనీ ని సిట్ అరెస్ట్ చేసింది. రోనీ ఇంటి దగ్గర గంజాయి ని స్వాధీనం చేసుకుంది. కొంత కాలంగా హీరోయిన్ కాజ‌ల్ కు మేనేజ‌ర్ గా రోని పనిచేస్తున్నాడు.రోని డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తెలుసుకున్న సిట్ అధికారులు నిఘా పెట్టారు. అతని ఇంట్లో గంజాయి దొర‌క‌డంతో వెంట‌నే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. రోని ఇంతకుముందు హీరోయిన్స్ లావ‌ణ్య త్రిపాఠి, రాశి ఖ‌న్నాకు మేనేజ‌ర్ గా ప‌ని చేశాడు