నా పేరు ముమైత్ ఖాన్..నన్ను పట్టుకోండి చూద్దాం..! - MicTv.in - Telugu News
mictv telugu

నా పేరు ముమైత్ ఖాన్..నన్ను పట్టుకోండి చూద్దాం..!

July 18, 2017

డ్రగ్స్ డొంక కదిలినప్పటి నుంచి ముమైత్ పైనే ధునియా నజర్ ఉంది. ఇటు ఎక్సైజ్ శాఖ..అటు బిగ్ బాస్..మధ్యలో జనం..ఇలా అందరూ ఈ అమ్మడు గురించి ఆలోచిస్తున్నారు. నా పేరు ముమైత్ ఖాన్ ..నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా అంటూ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్లకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…ముమైత్ ఖాన్ ఇంటి అడ్రస్ కనక్కోలేకపోయింది. ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలేకపోయారు. అసలు ఇస్తారా..లేదా..ఏం జరుగబోతోంది..?

హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఒక టీచర్‌ ఇంటిలో ఆమె ఉంటున్నట్లు తెలియడంతో అక్కడకు పంపారు. అక్కడ ఆమె లేకపోవడంతో నోటీసు అందలేదు. ముంబైలో సైతం ఆమె చిరునామా తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం పుణె సమీపంలోని లొనావ్లా ప్రాంతంలో జరుగుతున్న ఒక టీవీ చానల్‌ షోలో పాల్గొంటున్నట్లు గుర్తించారు. బుధ, గురువారాల్లో అక్కడికి ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను పంపించి నోటీసును అందజేయాలని నిర్ణయించారు.

అసలే బిగ్ బాస్ హౌస్ కు తాళం వేసి ఉంది. 70 రోజుల దాకా తీయరు. బయట మనిషి లోపలకు…లోపల మనిషి బయటకు రాలేడు..మరెలా..?పోలీసులు వెళ్లినా నోటీసులు ఎలా అందిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఒకవేల నోటీసులు ఇచ్చినా..బిగ్ బాస్ ఆమెను పంపిస్తాడా..?వీక్ మధ్యలో పంపితే షో కే ఎసరు రావొచ్చు.. రియాల్టీ దెబ్బ తీనొచ్చు. మొత్తానికి ముమైత్ ఖాన్ ఇష్యూ ఎక్సైజ్ హీరో అకున్ సబర్వాల్ వర్సెస్ బిగ్ బాస్ మధ్య పోరుగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో…