పూరీ విషయంలో పత్రికల ఓవర్ ఫెర్మామెన్స్...ఇంతకీ ఏది నమ్మాలి..! - MicTv.in - Telugu News
mictv telugu

పూరీ విషయంలో పత్రికల ఓవర్ ఫెర్మామెన్స్…ఇంతకీ ఏది నమ్మాలి..!

July 20, 2017

అసలేం జరుగుతోంది..పూరీ విషయంలో ఏ పేపర్ వార్త ను నమ్మాలి. ప్రధాన పత్రికలైనా ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి ,ఆంధ్ర జ్యోతి పేపర్లు చూస్తే ఎవరికివారే యమునా తీరే. ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో రాశారు. కామన్ సబ్జెక్టే అయినా దేనికి ఏదీ సరిపోవడం లేదు. ఒక్క విషయం మాత్రం పక్కాగా అర్థమవుతున్నది సోయి లేకుండా పూరీ విషయంలో ఓవరాక్షన్ చేస్తున్నాయని. అవును నిజమే.కావాలంటే నాలుగు పేపర్లని ఒకే దగ్గర పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది. కెల్విన్ తో సంబంధం లేదు…డ్రగ్స్ అసలే తీసుకోలేదు అంటూ పూరీ నెత్తినోరు బాదుకుంటున్నా…తమ స్టైల్లో రైటప్ , సెటప్ కే బ్లైండ్ గా సెట్ అయ్యాయి. కెల్విన్ తో సంబంధం ఉందంటూ ఫోటోల్ని చూపించే ప్రయత్నం చేశారు. సిట్ కూడా ఇలా ఆలోచించదేమో అనిపిస్తోంది వీళ్ల హడావుడి చూస్తుంటే.

టెంపర్ తో తేలేయే కథనాలతో పేజీల్ని నింపేశాయ్.. ఎవరికివారు తోపులం అనుకుంటూ పూరీపై లేనిపోనివి తోసేస్తున్నాయ్. పూరీని వెనకేసుకురావడం లేదు..సమర్థించడమూ అసలే లేదు..పాపం అని కూడా అనడం లేదు..చట్టం తన పని తను చేసుకుపోతోంది. ఆ చట్టం ఏం చేస్తుందో నిజంగా తెలిసిందే రాయాలి.అలా చెప్పడమే జర్నలిజం..ముఖ్యంగా పత్రికల పని.ఇది జరుగలేదే..ఎలక్ట్రానిక్ మీడియా గాలిలో పేపర్లు కొట్టుకుపోయాయి. నిజనిజాల్ని చెప్పడంలో సోయి లేకుండా ఉన్నాయి. కన్య్ఫూజింగ్ కథనాలతో జనల్ని తికమక పెట్టాయి. ఇలా ఏదీపడితే అది రాసిస్తే ఎలా..?పేపర్ లో వార్త వచ్చిదంటే జనం గట్టిగా నమ్ముతారు..వాటిపై వారికి అంతా నమ్మకం.. ఆ నమ్మకాన్ని నిలుపుకోకుంటే ఎలా…?

నిజానికి పూరీ డ్రగ్స్ తీసుకుంటే సిట్ తేల్చుతుంది. ఏది రైటో ఏదీ రాంగో బయటపెడుతుంది. ఆ విషయాన్ని తేల్చడానికే అకున్ సబర్వాల్ టీమ్ పనిచేస్తోంది. వాళ్లే డ్రగ్స్ దొంక కదిలిస్తారు..కలుగులో దాక్కున్న వారిని బయటకు తీస్తారు. మరి మీడియా ఓవర్ యాక్షన్ ఎందుకు. ఏ పత్రిక ఎన్నో ఉన్నవి , లేనివి రాసేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎందుకో. జనానికి తెలియాల్సిన నిజాలు తెలియక ఆగవు..అందుకే వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేయాలి..లేదంటే ఊరుకోవాలి.

సరే ఆ పత్రికలదే కరెక్ట్ అనుకుందాం. పూరీ మీద రాసిన వార్తలు…ఏ అగ్రహీరో, అగ్ర నిర్మాత విషయాల్లో ఇలాగే ఉంటాయా..? వారిని ఏకి పారేసే దమ్ముందా…?సినీ పెద్దలు విషయంలో ఒకటి పదిసార్లు ఆలోచించే మీడియా..పూరీ విషయంలో ఇంతగా బరితెగించాలా…? రేపు రేపు డ్రగ్స్ కేసుల్లో పెద్దల పేర్లు బయటకు వస్తే ఇలాగే చేస్తారా…?వాళ్ల విషయంలో మేనేజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు రాసే సత్తా ఉందా..?మూమూలుగా సినీ పెద్దల సినిమా రివ్య్వూ ల గురించి నెగిటివ్ గా రాయాలంటే తెగ భయపడిపోతారు…ఇంకా డ్రగ్స్ వార్తలు దమ్ము ఎక్కడ ఉంటుందిలే…నిజంగానే ఆ గట్స్ ఉంటే అసలు డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇవ్వండి. అంతేకానీ దొరికాడు కదా పూరీని బకరా చేసి ఆడుకోవడం ఏంటీ..?

డ్రగ్స్ కేసులో లో పూరీ నిందితుడే..ఆ విషయం మరిచిపోవద్దు. ఆరోపణలు ఏమున్నాయో చెప్పేవరకే పత్రికల పని…ఒప్పించే బాధ్యత కాదు అని తెలుసుకోవాలి.నిజంగా పూరీ డ్రగ్స్ తీసుకుని ఉంటే ఆ విషయాన్ని సిట్ నిరూపిస్తుంది. శిక్ష పడేలా చేస్తుంది.మరి మీడియాకెందుకు ఆ పని.వదిలేయండి ఒక్కసారి మాయమైపోతున్న నైతిక విలువల్ని గుర్తుతెచ్చుకోండి..దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ఇవ్వండి..చానల్స్ గోలలో పడి కొట్టుకుపోకండి..జనాల్లో పేపర్లకు ఉన్నా నమ్మకాన్ని నిలుపుకోండి..