పూరీని ఇరికించే ప్రయత్నం... - MicTv.in - Telugu News
mictv telugu

పూరీని ఇరికించే ప్రయత్నం…

July 20, 2017

టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్ కేసులో సిట్ ముందు హాజరైన కెమెరామెన్‌ శ్యామ్ కే నాయుడు పూరీని ఇరికించే ప్రయత్నం చేశాడు. పూరీ జగన్నాథ్‌ చెప్పడం వల్లే ఆన్‌లైన్‌లో డ్రగ్ వ్యాపారి కెల్విన్ కు డబ్బు పంపానని సిట్‌కు వివరించాడని తెలిసింది. శ్యామ్‌ కె.నాయుడిని సిట్‌ అధికారులు విచారించారు. సుమారు ఐదున్నర గంటలపాటు విచారణ సాగింది. ముఖ్యంగా కెల్విన్‌ వాట్సప్‌‌ మెసేజ్‌లపై ఆయన్ను సిట్ ప్రశ్నించింది. విచారణలో అధికారులు పలు కీలక సమాచారం రాబట్టిందని సమాచారం.