డ్రగ్స్ ఏంటీ..ఈ స్కూళ్లు ఏంటీ..ఎటు వైపు పోతున్నాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ ఏంటీ..ఈ స్కూళ్లు ఏంటీ..ఎటు వైపు పోతున్నాయ్..!

July 5, 2017

ఇది షాకింగ్ న్యూస్. తల్లిదండ్రుల గుండెలదిరే కఠోర వార్త. విద్యా బుద్దులు నేర్పే విద్యాలయాల్లో డ్రగ్స్ దందా..సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. విద్యార్థులు ఏంటీ..డ్రగ్స్ ఏంటీ..సమాజం ఎటు వైపు పోతోంది. అసలేం జరగుతోంది. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసే పేరున్న స్కూళ్లు, కాలేజీల సోయి ఎక్కడికి పోయింది..? డ్రగ్స్ మత్తులో కొందరు విద్యార్థులు జోగుతుంటే ఏం చేస్తున్నారు..?స్టూడెంట్స్ కేరింగ్ లో ఎందుకీ నిర్లక్ష్యం..?అసలు తప్పు ఎవరిది..విద్యార్థులదా..తల్లిదండ్రులదా..స్కూళ్లు, కాలేజీల మేనేజ్ మెంట్స్ దా..?

హైదరాబాద్ డ్రగ్ సిటీ.డ్రగ్స్ కు కేరాఫ్.. కాదు కాదు..అంతకుమించి తయారైంది. ఈ గలీజ్ దందాపై సిట్ వెల్లడించిన భయంకర నిజాల్ని వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. హైదరాబాద్ లో మాంచి పేరున్న 19 పాఠశాలలు.. 14 కళాశాలల్లో.. 1000 మంది విద్యార్థులు మత్తులో జోగుతున్నారు. కేంద్రీయ విద్యాలయం సహా.. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ఎల్ ఎస్ డీ, ఎంసీడీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. మరి స్కూళ్లు ,కాలేజీలు ఏం చేస్తున్నాయి. విద్యార్థుల్ని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం లేదా.?క్యాంపస్ దగ్గరలో డ్రగ్స్ కొంటుంటే నిద్రపోతున్నారా..? మా స్కూల్ , కాలేజ్ చాలా స్ట్రిక్ట్. రిజల్ట్స్ లో టాప్ ప్లేస్.విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు ఇతర యాక్టివిటీస్ ఉంటాయి..అని చెబుతుంటారు. ఎక్సట్రా యాక్టివిటీస్ అంటే డ్రగ్స్ తీసుకోవడమేనా..?

మార్నింగ్ నీట్ గా తయారై స్కూల్, కాలేజీ బస్సు ఎక్కి వస్తారు. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ వరకు వోకే.ఇంటర్వెల్ గంట మోగగానే కొందరు గయబ్.లంచ్ ముగియగానే మరికొందరు జంప్. ఇలా జంపైన స్టూడెంట్స్ సినిమాలు, షికార్లు చేస్తుంటారు. మళ్లీ బస్సు ఎక్కే టైమ్ కి అక్కడకొస్తారు. ఇక డే స్కాలర్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. ఆడిందే ఆట..పాడిందే పాట..ఇలా బడికి బంక్ కొట్టేవాళ్లు కొందరు. ఇలా వీరందరు ఒకచోటకు చేరి పిజ్జా, బర్గర్ లు, బిర్యానీలే కాదు డ్రగ్స్ టేస్ట్ చూస్తున్నారు. గమ్మత్తుగా ఉందని మత్తులోకంలో తేలిపోతున్నారు. ప్యాకెట్ మనీ వీటికి తగేలుస్తున్నారు. డే బై డే డోస్ మించుతుందే తప్ప తగ్గదు.

పిల్లలు ఇలా జంప్ అవుతుంటే కాలేజీలు మేనేజ్ మెంట్ ఏం చూస్తున్నాయనే డౌట్ కామన్. క్లాసులు , గ్లిసుల బిజీలో లెక్చరర్లు. మిగతా వాళ్లు ఎవరిపనుల్లో వారు బిజీ. ఫీజుల మీద ఇంట్రెస్టే గానీ.స్టూడెంట్స్ కేరింగ్ లో ఎందుకు ఉంటుంది. ఉండనే ఉండదు..ఇదే స్టూడెంట్స్ కు అవకాశం ఇస్తుంది. డ్రగ్స్ దారి నడిపిస్తోంది. అటెండ్స్ లేదని తిడుతారే తప్ప…వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు..ఏం చేస్తున్నారనే ఇంగితం ఉండదా.. ? ఏదీ మంచో..ఏదీ చెడో చెప్పాల్సిన అవసరం లేదా..?తొలుత హుక్కా సెంటర్లు..ఆ తర్వాత డ్రగ్స్ కేంద్రాల దారి పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోరు..లెక్చరర్లు తిడితే ఎవడు వింటాడు..పైగా రివర్స్ అవుతారు.అందుకే గాలికొదిలేస్తుంటారు. ఈ గాలిగాళ్లే గమ్మత్తులోకంలో చిత్తవుతున్నారు.

డ్రగ్స్ కూపంలోకి విద్యార్థులు కురుకుపోతుండటంలో విద్యా సంస్థల యాజమాన్యాల తప్పే కాదు…ముమ్మాటికీ తల్లిదండ్రుల ఫాల్ట్ ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు..ఎలా చదువుతున్నారు.రెగ్యులర్ గా వెళ్తున్నారా..బంక్ కొడుతున్నారో..తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్యాకెట్ మనీ ఎక్కువగా అడిగితే ఇచ్చేస్తున్నారే కానీ మిగతా ఏం ఆలోచించడం లేదు. స్కూల్ , కాలేజీ కి వెళ్లే వాడికి ఏం ఖర్చులు ఉంటాయన్న సోయి లేదు. కట్టల కొద్ది డబ్బు ఉందని రోజుకో పెద్ద నోట్ ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటది.డ్రగ్స్ తీసుకుని చిత్తవక…ర్యాంకర్స్ గా మారుతారా ఏంటీ? డ్రగ్స్ దారి పట్టిన రోజే తెలుసుకుని నాలుగు తగులిస్తే అటు వైపు కన్నెత్తి చూస్తాడా..?

సిటీలో నెలకో డ్రగ్ ముఠా దొరుకుతుంది. ఎన్ని సార్లు ..ఎంత పెద్దమొత్తంలో డ్రగ్స్ దొరికినా పట్టుపడిదెవరు అంటే నైజీరియన్లే..వీళ్లతో లోకల్లో కొందరికి లింకులు..ఇదంతా చైన్ దందా..పట్టుబడితేనే పోలీసుల హడావుడి తప్ప..గుట్టుచప్పుడు సాగుతున్న టైమ్ లో పోలీసులు కన్నెత్తి చూడరు. కేసులు రాసేసి దొరికినోళ్లను బొక్కలోకి తోస్తారు. అంతే ఓ పనైపోయిందనుకుంటారు. అస్సులు సిటీ లో ఎంతమంది నైజీరియన్లు ఉన్నారు..?వీళ్లల్లో అక్రమంగా ఉంటున్నది ఎందరు..వీసా గడువు ముగిశాక ఉన్న వారెందరు..వీళ్లు ఎక్కడెక్కడా ఉంటున్నారు..ఏం చేస్తున్నారన్న దానిపై పోలీస్ శాఖ నిఘా ఏమైంది..?ఒక్కసారి ఆపరేషన్ డ్రగ్ నైజీరియన్ నిర్వహించండి. దొరకినోడిని దొరికినట్టు బొంకలో వేయండి..అప్పడే డ్రగ్స్ దందాకు కళ్లెం పడుతుంది. లేదంటే..ఆరు కాలేజీలు మూడు స్కూళ్లు అన్నట్లు సాగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని పోలీసుల శాఖ గట్టి కౌల్సింగ్ ఇవ్వాలి.

ఇక డ్రగ్స్ కు అలవాటైన విద్యార్థుల స్కూళ్లు ఇవే

1) జూబ్లీ పబ్లిక్ స్కూల్,
2) ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్,
3) ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్,
4) చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్,
5) అఘాఖాన్ స్కూల్,
6) రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్,
7) గ్లెండేల్ స్కూల్,
8) ఢిల్లీ పబ్లిక్ స్కూల్,
9) భారతీయ విద్యా భవన్,
10) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్,
11) నాజర్ స్కూల్,
12) సంఘమిత్ర పబ్లిక్ స్కూల్,
13) శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్,
14) సిల్వర్ ఓక్స్ స్కూల్,
15) కేంద్రీయ విద్యాలయ,
16) అక్షర ఇంటర్నేషనల్ స్కూల్,
17) గీతాంజలి పబ్లిక్ స్కూల్,
18) జాన్సన్ గ్రామర్ స్కూల్,
19) డీఏవీ పబ్లిక్ స్కూల్.

 

                                                                                                                                        కాలేజీలు..

1) సీబీఐటీ,
2) నిజాం కాలేజీ,
3) గోకరాజు రంగరాజు,
4) ఎంజీఐటీ,
5) అరోరా కాలేజీ,
6) సెయింట్ మేరీ కాలేజీ,
7) ఏవీ కాలేజీ,
8) శ్రీనిధి కాలేజీ,
9) సెయింట్ జోసెఫ్ కాలేజీ,
10) ఇక్ఫాయి,

11) హైదరాబాద్ బిజినెస్ స్కూల్,
12) భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ,
13) సెయింట్ ఫ్రాన్సిస్,
14) విల్లా మేరీ కాలేజీ.