అకున్ సబర్వాల్..రియల్ హీరో.. మీరు కేక సారూ..! - MicTv.in - Telugu News
mictv telugu

అకున్ సబర్వాల్..రియల్ హీరో.. మీరు కేక సారూ..!

July 14, 2017

హీరో లు జీరోలయ్యారు. డ్రగ్స్ తో స్టార్ డమ్ ఢమాల్. వెండితెరపై వెలుగు వెలుగు వాళ్లు రియల్ లైఫ్ లో విలన్లు అయ్యారు.డ్యూటీ ఈజ్ డ్యూటీ అంటూ రియల్ లైఫ్ పోలీసు ఆఫీసర్ ఇప్పుడు హీరో అయ్యాడు. .ఎస్ నిజంగా అకున్ సబర్వాల్ హీరోనే..ఎందుకంటే…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో..తర్వాత తెలంగాణ వచ్చాక డ్రగ్ రాకెట్లు చాలా బయటపడ్డాయి. ప్రతిసారీ సినీ లింకులు వెలుగుచూశాయి. అక్కడితోనే కేసు చీకట్లోకి పోయేది..ఎవరి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా కూడా తెలిసేది కాదు.జనం దాన్ని గురించి మరిచి పోయే వారు. కానీ ఒకే ఒక్కడి వల్ల డ్రగ్స్ డంప్ డొంక కదిలింది.

ఆ ఒక్కడే అకున్ సబర్వాల్. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ మొబైల్‌డాటాతో టాలీవుడ్ కి దడ పుట్టిస్తున్నారు. అందరు అధికారుల్లా ఈయన వారిని మామూలుగా వదిలేయలేదు. ఎవరెవరు నిషా ప్రొడక్షన్స్ లో ఉన్నారో శోధించి సాధించి నోటీసులు ఇచ్చారు.సిట్ తో కలుగులో దాక్కున్న వాళ్లను బయటకు లాగారు. ఇప్పటివరకు మొత్తం 4 కేసులు నమోదు చేసి డజన్ మందికి పైగా నోటీసులు ఇచ్చారు.

అధికారికంగా అకున్ సబర్వాల్ సినీ నిషాచారుల పేర్లు బయటపెట్టకపోయినా…వాళ్ల పేర్లు మాత్రం బయటకొచ్చేశాయ్. అందుకే ఈయన అంటే సినీ జనులు ఆవేశంతో ఊగిపోతున్నారు. మేనేజింగ్ లో సినీ పెద్దలు హీరోల కన్నా ఎక్కువ కదా… సర్కార్ లో పెద్దల్ని మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పనికాకపోతే..కనీసం అకున్ సబర్వాల్ నైనా ఏదో ఒకటి చేయండి అనేదాకా వచ్చారని మీడియా కోడై కూస్తోంది. సో సర్కార్ సినీ జనుల్ని కాదనలేక అకున్ సబర్వాల్ ను సెలవు పై పంపుతున్నారని నెటిజన్లు నెట్టింట్లో నెత్తినోరు బాదుకుంటున్నారు.

అయితే వ్య‌క్తిగ‌త ప‌నుల మీద ఈనెల 16 నుంచి 27 వ‌ర‌కు సెల‌వుపై వెళ్తున్న‌ట్లు అకున్ సబర్వాల్ చెబుతున్నారు. కేసు ద‌ర్యాప్తున‌కు.. త‌న సెల‌వుకు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. కేసు ద‌ర్యాప్తున‌కు ప్ర‌భుత్వం పూర్తిగా స‌హ‌కరిస్తోంద‌ని చెప్పారు. చూడాలి ఈయన వచ్చేదాకా…ఎంతమందిని అరెస్టు చేస్తారో… లేదో కేసు గప్ చుప్ గా పక్కన బెడుతారో…