టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు అరెస్టుల దాకా వెళ్లే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ని వదలొద్దని సర్కార్ నిర్ణయించింది. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరకాకపోతే కటకటాలు తప్పవంటోంది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లిన కేసు విచారణలో స్పీడప్ తగ్గదని స్పష్టం చేస్తుంది. డ్రగ్స్ దందాలో ఉన్నవారి తాటతీయాలని సర్కార్ భావిస్తోంది.
ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అయింది. ఇప్పటివరకు బయటపడిన లిస్టులో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు,హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్,డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్) ఉన్నారు.