తాగుబోతులారా కోర్టులున్నాయి జాగ్రత్త ! - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతులారా కోర్టులున్నాయి జాగ్రత్త !

August 8, 2017

తాగితే తాగిర్రు కానీ బండి నడుపుడో, కారు నడుపుడో చెయ్యకుర్రి. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ డ్రైవ్ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా నిర్వహిస్తున్నాయి. టార్గెట్లు పెట్టుకొని మరీ పోలీస్ శాఖా తాగుబోతులను జైలుకు పంపే మహత్తర కార్యక్రమాన్ని చేస్తోంది. ప్రతీ పోలీస్ స్టేషన్ కు ఇంత మందిని పట్టుకొని కోర్టులో హాజరు పరచాల్సిందే అనే లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతోంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలె.. మీరెంత పెద్ద పుడింగి అయినా, ఎన్ని పరిచయాలున్నా తాగి వెహికిల్ నడుపుతూ పోలీసులకు దొరికితే మీ పరిచయాలు, పరపతి అంతా ఉత్తదే. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం ఇదో ఆన్ లైన్ ప్రోగ్రాం. అంతా కెమెరాల ముందే జరుగుతుంది.

మిమ్మల్ని భయ పెట్టడానికిది చెప్పట్లేదు. ఇందుకు మంచి ఉదాహరణ వుంది. హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్ట్ డ్రంక్ డ్రైవ్ లో దొరికిన వారిని దొరికినట్టే జైలుకు పంపింది. వీరికి శిక్షలు కూడా ఖరారు చేసింది. ముగ్గురికి 20 రోజులు, 6 గరికి 10 రోజులు, మరో 42 మందికి 2 రోజుల శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది ఎర్రమంజిల్ కోర్టు. ఎంత తాగినా హోష్ లో వుండండి. తాగినప్పుడు సొంతంగా కారు, బైకులు నడపకుండా ఏ ఉబర్, ఓలా క్యాబ్ ల సహాయం తీసుకోండి.