తాగుబోతు సీఐ.. డ్రైవింగ్ బీభత్సం.. - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు సీఐ.. డ్రైవింగ్ బీభత్సం..

January 30, 2018

చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. అన్నట్లుంది మన పోలీసుబాబుల వ్యవహారం. ఓ పక్క తమ డిపార్ట్‌మెంట్ డ్రంకన్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపుతోంటే ఈ సీఐ మాత్రం పట్టించుకోకుండా పూటుగా మందుకొట్టి కారు నడిపాడు..అతగాడి బీభత్సమైన డ్రైవింగ్ ఫలితంగా అతనితోపాటు నలుగురు గాయపడ్డారు.

హైదరాబాద్‌ రేంజ్‌లో సీఐగా పనిచేస్తున్న గిరీశ్‌రావు పీకల్దాకా మందుకొట్టి కారునడిపాడు. కైకూరు రోడ్డుగుండా యాప్రాల్‌ శైలి గార్డెన్‌లోని తన ఇంటికి వెళ్తుండగా యాప్రాల్‌ దగ్గర్లోని మిలటరీ ఏరియాలోని హనుమాన్‌ దేవాలయం పూర్తిగా మతికోల్పోయాడు. కారు అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న మూడు మోటార్ బైకులను, ఓ ఆటోను ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న అతగాడి బంధుమిత్రులు, పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి పంపారు. గిరీశ్ కు బ్రీత్ అనలైజర్ తో పరీక్ష జరపగా 230 పాయింట్లు తాగినట్లు తేలింది.