మందుబాబు వీరంగం.. మెడలో నాగుపాముతో - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబు వీరంగం.. మెడలో నాగుపాముతో

May 6, 2020

Drunk Man Bites Snake in Karnataka

చాలా రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు మత్తులో చిత్తు అవుతున్నారు. ఒళ్లు తెలియకుండా తాగి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.  ఇటీవల కర్నాటకలో ఓ మందుబాబు కూడా ఇలాగే చేశాడు. మత్తులో ఏ మాత్రం భయం లేకుండా ఏకంగా నాగు పామును మెడలో వేసుకొని హల్ చల్ చేశాడు. అతన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. 

కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామంలో ఓ తాగుబోతు ప్రజలను హడలెత్తించాడు. ఫూటుగా తాగి బైక్ వస్తూ హీరో ఇజం చూపించాడు. తాగిన మైకంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి నాగుపాము కనిపించింది. వెంటనే ఆగి తాన్ని చేతిలోకి తీసుకొని నోటితో బలంగా కొరికాడు. దాంతో అది ప్రాణాలు వదిలింది. అయినా వదలకుండా.. నోట్లో మందు బాటిల్, మెడలో నాగుపాము వేసుకొని వచ్చాడు.అతన్ని చూసిన స్థానికులు వీడియోలు తీశారు. ఇప్పడది వైరల్ అయ్యింది. మైకంలో మందుబాబులు ఇలా విచిత్రంగా ప్రవర్తించడంపై పలువురు ఆందోళన చెందుతున్నారు.