మెట్రోలో మందుబాబు చిందులు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోలో మందుబాబు చిందులు (వీడియో)

September 13, 2019

ఎప్పుడైనా తాగుతాం.. ఎక్కడైనా తందనాలు ఆడుతాం.. నో టైం-నో సెన్స్.. 24 గంటలు మా పనే అది అన్నంత పని చేస్తున్నారు కొందరు మందుబాబులు. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా మరిచి వేళాపాళా లేకుండా తాగేసి రచ్చరచ్చ చేస్తున్నారు. అలాంటి ఓ తాగుబోతు ఫూటుగా మద్యం సేవించి మెట్రో రైలులో ఎక్కి హల్‌చల్ చేశాడు. సికింద్రాబాద్‌ నుంచి తార్నాక వెళ్తున్న మెట్రోరైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

మద్యం మత్తులో వున్న మందుబాబు సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి గట్టిగా అరుస్తూ డాన్స్ చేయసాగాడు. దీంతో తోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. పసిపిల్లలు భయపడ్డారు. అతన్ని మెట్రో రైలులోకి అనుమతించడంతో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు సిబ్బంది మందుబాబును తార్నాక స్టేషన్‌లో దించేశారు. అతని వీరంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.