తాగుతోతు దారుణం.. ఎలుగుబంటిని నీటిలో ముంచి..
జీవశాస్త్రం ప్రకారం మనిషి కూడా జంతువే. పరిణమక్రమంలో మిగతా జంతువులకు భిన్నంగా తెలివితేటలు నేర్చి సృష్టిపై ఆధిపథ్యం సాధిస్తున్నాడు. అయితే కొందరు మనుషులు జంతువులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జూలోకి చొరబడిన ఓ మనిషి తన మానాన తాను తింటున్న ఎలుగును కవ్వించాడు. అది కాస్తా వెంటపడేసరికి నీటిలో దూకాడు. అది కూడా నీటిలోకి దూకండంతో దాని మెడపట్టుకుని ముంచేసి చంపేయబోయాడు.
Niezły świr pic.twitter.com/UETZOJ6NIh
— Wnukers (@wnukers) May 21, 2020
పోలండ్‌లోని వార్సా జూలో గత నెల 26న ఈ సంఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్లోకి చొరబడ్డాడు. సబ్రినా అనే ముసలి ఆడ ఎలుగు చెంతకు వెళ్లాడు. ఆ మూగజీవి ఇదివరకు సర్కస్‌లో పనిచేసింది. మనుషులు ఎంత హింస పెడతారో బాగా తెలిసిన ఎలుగు అతణ్ని వాలకం చూసి సరదాగా వెంటపడింది. దీంతో అతడు కందకంలో దూకాడు. అది కూడా దూకేసింది. వాడు ఎలుగు పట్టు నుంచి తప్పించుకుని దాని చెవులు మెలిపెట్టి, వీపుపై కూర్చున్నాడు. దాన్ని తొక్కిపెట్టి చంపేయడానికి యత్నించాడు. అది విదిలించడంతో గట్టు ఎక్కి పారిపోయాడు. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో మిగతా ఎలుగుబంట్లు లోపల తింటున్నాయని, సబ్రినా జాలి తలచి వదిలేసిందని జూ సిబ్బంది తెలిపారు. వయసులో ఉన్న మగ ఎలుగుబంటి చేతికి చిక్కింటే కథ మరోలా ఉండేదన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి జరిమానా వడ్డించారు.