ఆత్మహత్య చేసుకుంటే ఎన్నేళ్లు జైలు? పోలీసులకు చుక్కలు చూపించాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్య చేసుకుంటే ఎన్నేళ్లు జైలు? పోలీసులకు చుక్కలు చూపించాడు..

February 3, 2020

Drunkard.

సోషల్ మీడియా కాస్తా కొందరి నిర్వాకంతో కామెడీ మీడియాగా మారిపోతోంది. పోలీసులు నడుపుతున్న ఖాతాల్లో చతుర్లు, ఛమక్కులు పడుతున్నాయి. ‘సార్, నేను ఆత్మహత్య చేసుకుంటే ఎన్నేళ్లు జైలు శిక్ష విధిస్తారు?’ అని ఓ నెటిజన్ వారికి చుక్కలు చూపించాడు. 

ముంబైకి చెందిన నీలేశ్ బెదేకర్ ఏవో సమస్యల వల్ల ప్రాణం తీసుకోవానుకున్నాడు. అయితే ఆత్మహత్య, ఆత్మహత్య యత్నాలు ఐపీసీ కింద నేరమని గుర్తుకొచ్చింది. నేరాల వ్యవహారాల్లో ఆరితేరిన పోలీసులకు గుర్తుకొచ్చారు. పోలీసులు నడుపుతున్న ట్విటర్ ఖాతా గుర్తుకొచ్చింది. ‘నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించకున్నా.. దీనికి మన దేశంలో ఎలాంటి శిక్ష వేస్తారో నాకు తెలియదు. గూగుల్, వికీపీడియాల్లోనూ సమాచారం లేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా’ అని చెప్పాడు. దీంతో పోలీసులకు దిమ్మతిరిగింది. నీలేశ్ ఫోన్ నంబర్ తీసుకుని అతనికి నచ్చజెప్పారు. అయినా అతడు వినకలేదు. ఎన్నేళ్లు జైలుశిక్ష అనుభవించాలో చెప్పాలని పట్టుబట్టాడు. దీంతో పోలీసులు అతని ఇంటికెళ్లి పని పూర్తి చేశారు. ఆత్మహత్య మంచిది కాదని చెప్పి, ఆస్పత్రికి తరలించారు. నీలేశ్ మద్యం మత్తులో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.