తాగడానికి డబ్బివ్వలేదని ముక్కు కొరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

తాగడానికి డబ్బివ్వలేదని ముక్కు కొరికాడు..

April 6, 2018

తాగుబోతుల చేష్టలు అన్నీ ఇన్నీకావు. కాస్త గొంతులో పడకపోతే ఇల్లుపీకి పందిరేస్తాడు. తాగడానికి  పైసలు ఇవ్వలేదని ఓ మందుబాబు తన అన్న ముక్కును కొరికేశాడు. పొట్టపైనా కరిచాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కనౌజ్ జిల్లా రామ్‌లాల్‌పూర్వ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బాధితుడు ముక్కు కు కట్టుకట్టించుకుని చికిత్స పొందుతున్నాడు.మద్యానికి బానిస అయిన శ్రీకాంత్.. రోజూ ఇంట్లో డబ్బు కోసం అల్లరి చేసేవాడు. అన్నయ్య సోబ్రాన్‌ అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో శ్రీకాంత్ అగ్రహంతో సోబ్రాన్ ముక్కును కొరికాడు. నాలుక, చేతులు, పొట్టపైనా కరిచాడు. సోబ్రాన్ రక్తస్రావంతో సొమ్మసిల్లి పడిపోయాడు. శ్రీకాంత్ అంతటితో ఆగకుండా తండ్రిపైనా దాడి చేసి, పిచ్చికుక్కలా చేతిని కరిచాడు. కన్నతల్లిపైనా దాడికి తెగబడ్డాడు. అయితే తానెవర్నీ కొరకలేదని, స్రోబ్రానే కొరుక్కున్నాడని తాగుబోతు చెప్పుకొస్తున్నాడు. ఎవరైనా తన ముక్కును తాను ఎలా కొరుక్కుంటారుని అని ప్రశ్నించగా ఏమో.. నాకు తెలియదు అని అంటున్నాడు.