పోలీసులను ఢీకొట్టి పారిపోయిన మందుబాబుల కారు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులను ఢీకొట్టి పారిపోయిన మందుబాబుల కారు

March 27, 2018

మందుబాబులకు, పోలీసులకు జాతివైరం కంటే ఎక్కువ వైరం. తాగుబోతులను పట్టుకోవాలని, చలానాలు వేయాలని, వీలైతే సొంత జేబులు నింపుకోవాలని పోలీసుల ఆరాటం. అప్పటికే తాగి డబ్బులు పోగొట్టుకున్న మందుబాబులు మళ్లీ టెస్టులు, శిక్షలు, జరిమానాలు అంటే కస్సుమంటారు. ఆగ్రహంతో కొందరు బూతులకు దిగితే మరికొందరు ఇలా పోలీసులను కారుతో తొక్కుకుంటూ పోతారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తనిఖీని తప్పించుకోవడానికి ఐదుగురు మందుబాబులు వారిని కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఎస్పీ ఆఫీసు ఎదుటే ఈ ఉదంతం చోటుచేసుకుంది. కారును అడ్డుకోవడానికి ఓ కానిస్టేబుల్ కారుకు బారికేడ్‌ను అడ్డం పెట్టాడు. అయినా మందుకారు ఆగకుండా దాన్ని ఢీకొట్టి, తర్వాతద అతనిపై నుంచి వెళ్లిపోయింది. మరో పోలీసు కూడా గాయపడ్డాడు. కారులో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని, వారిని పట్టుకోవడానికి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.