పోలీస్‌పై తల్వార్‌తో దాడి.. తాగుబోతుల వీరంగం - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్‌పై తల్వార్‌తో దాడి.. తాగుబోతుల వీరంగం

March 28, 2018

ముందుబాబులు శ్రుతిమించిపోతున్నారు. పోలీసులపై అక్కసుతో చేయరాని ఘోరాలు చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులను కారుతో ఢీకొట్టిన ఘటనను మరవక ముందే చెన్నైలో అంతకుమించిన దారుణం జరిగింది. ముగ్గురు మద్యాసురులు తమ అరాచకాన్ని అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్‌పై తల్వార్‌తో దాడి చేశారు. మంగళవారం రాత్రి పూనమల్లి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

స్థానిక ఠాణాలో పనిచేస్తున్న అంబళగన్ అనే పోలీసుకు రాత్రి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. హాక్టో నగర్‌లో ముగ్గురు తాగుబోతులు అల్లరి చేస్తున్నారని కాలర్ తెలిపాడు. దీంతో అంబళగన్ మరో పోలీసుతో కలసి అక్కడికెళ్లాడు. మందుబాబుల బైక్ తాళాలు లాక్కున్నాడు. తన మొబైల్ ఫోన్లో ముగ్గరి ఫోటోలను తీసుకున్నాడు. దీంతో ఆ ముగ్గురికి కోపమొచ్చింది. ఆ ఫోన్‌ను లాక్కున్నారు. తర్వాత అతణ్ని వెంటాడి దాడి చేసి తమ బైక్‌పై  పారిపోయారు. ఈ దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులపై పాత నేరస్తులని గుర్తించిన పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు.