హైదరాబాద్‌లో యువతుల దారుణం.. కారుతో గుద్ది చంపారు.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో యువతుల దారుణం.. కారుతో గుద్ది చంపారు..

April 23, 2018

హైదరాబాద్ లో బడాబాబుల కుమార్తెలు సోమవారం తెల్లవారుజామున ఘోరానికి తెగబడ్డారు. తప్పతాగి వేగంగా కారు నడపి ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒక అభాగ్యుడి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. నిందితుల్లో ఒక పోలీసు  అధికారి కుమార్తె కూడా ఉంది. ఈ నలుగురిపై పోలీసులు కేసు పెట్టారు. అయితే కేసును నీరుగార్చుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్న యువతులు ఏఎస్ రావునగర్ నుంచి తర్నాకవైపు  వేగంగా స్కోడా కారు నడుపుకుంటూ వచ్చారు. కారు నడుపుతున్న యువతి కుషాయిగూడ డీఈ కాలనీ వద్ద కంట్రోల్ తప్పడంతో కారు ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న అశోక్ అనే వ్యక్తిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. చెప్పులు కుట్టి జీవిస్తున్న అశోక్‌కు నిలవనీడ లేకపోవడంతో ఫుట్ పాత్ పైనే నిద్రిస్తున్నాడు.  అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కారులో ప్రయాణించిన యువతులు శ్రీనిధి కాలేజీలో బీటెక్ సెకండ్ యియర్ చదువుతున్న ఈశాన్య పత్తిరెడ్డి, సృజన కొత్వా, అమృత భారతి, హారికా రెడ్డిగా గుర్తించారు. హారిక మలక్ పేట సీఐ గంగిరెడ్డి కూతురిగా గుర్తించారు. ఈశాన్య రెడ్డి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసు అధికారి కుమార్తె ఉండడంతో నిందితులను కేసు నుంచి తప్పించేందుకు పెద్దతలకాయలు రంగంలోకి దిగినట్లు సమాచారం.