పోలీస్ స్టేషన్‌లో మందుబాబు రచ్చ.. పోలీసులను బెదిరిస్తూ.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ స్టేషన్‌లో మందుబాబు రచ్చ.. పోలీసులను బెదిరిస్తూ..

May 19, 2020

vjhyg

ఓ మందుబాబు తప్పతాగి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే రచ్చ రచ్చ చేశాడు. పోలీస్ స్టేషన్‌ను ఇల్లు అనుకున్నట్టున్నాడు.. ఇల్లు పీకి పందిరి వేసినంత పనిచేశాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు తనయుడైన రాజీవ్ ఫూటుగా మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.  మండల కేంద్రానికి చెందిన చంటి, శంకర్ అనే ఇద్దరు యువకులు ఈరోజు ఉదయం ఓ కేసు విషయంలో రాజీవ్‌ని తీసుకొని వచ్చారు. 

తాగిన మైకంలో ఉన్న రాజీవ్ ఒంటి మీద స్పృహలేకుండా ప్రవర్తించాడు. రావడంరావడమే పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించారు. పోలీసులను బెదిరిస్తూ ఎస్సై నేమ్ ప్లేట్, ఫర్నిచర్ నేలకేసి పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఎస్సై టేబుల్‌కు తల పగలగొట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.