Drunken teacher beat students in mahaboobabad
mictv telugu

మత్తులో ఉండగా చూసి నవ్వారని స్టూడెంట్లను కొట్టిన టీచర్

November 17, 2022

Drunken teacher beat students in mahaboobabad

మద్యం తాగడమే కాకుండా తాగి ఊగుతున్నప్పుడు ముగ్గురు స్టూడెంట్లు చూసి నవ్వారనే కోపంతో ఓ టీచర్ వారిపై దాడికి దిగాడు. అందులో ఓ బాలిక మెడనొప్పితో బాధపడుతుండంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఎస్జీటీ టీచర్ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మత్తులో ఊగుతున్న అతనిని చూసి ముగ్గురు విద్యార్ధినులు నవ్వడంతో కోపంతో వారిపై చేయి చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న ప్రవళిక అనే బాలిక మెడపై దెబ్బ గట్టిగా తగిలింది. దీంతో ప్రవళిక ప్రిన్సిపాల్‌‌కి ఫిర్యాదు చేయగా, ఓ మాత్ర ఇచ్చి ఎవరికీ చెప్పవద్దని, నొప్పి తగ్గిపోతుందిలే అని హెచ్చరించి పంపించేసింది. మరుసటి రోజు ఉదయం నొప్పి తీవ్రమవడంతో ప్రవళిక జరిగిందంతా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ వచ్చి ప్రవళికను జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.