స్నేహమంటే ఇదేనా? మందు మానేశాడని దంచికొట్టారు.. - MicTv.in - Telugu News
mictv telugu

స్నేహమంటే ఇదేనా? మందు మానేశాడని దంచికొట్టారు..

May 8, 2019

మద్యానికి బానిసైన ఎందరో మందుబాబులు కాపురాలను కొల్లేరు చేసుకున్నారు. తాగుబోతు భర్తలు ఆ మహమ్మారి బారినుంచి బయటపడాలని ఎందరో ఇల్లాల్లు మొక్కని దేవుడు వుండడు. చాలా మంది మానినట్టే మానేసి మళ్లీ తాగుతుంటారు. చాలా తక్కువ మంది ఆ వ్యసనాన్ని మానుకుంటారు. అలా మానుకుంటే సంతోషిస్తారు గానీ, ఓచోట మందు ఎలా మానేస్తావని.. పెళ్లయితే తమతో మందు తాగవా అంటూ స్నేహితులే అతణ్ణి చితకబాదారు. అడ్డొచ్చిన అతని భార్యను కూడా కొట్టారు. ఈ చిత్రమైన ఘటన అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది.

Drunkers who beat a friend to stop drinking.

అమృత్‌సర్‌లోని ఛెహరట్ ప్రాంతానికి చెందిన అమృత్ పాల్ పెళ్లికాక ముందు మందుకు బానిస. క్రమం తప్పకుండా తన స్నేహితుడు జోధా సింగ్‌, ఇతర స్నేహితులతో కలిసి మద్యం సేవించేవాడు. వారి స్నేహం రోజూ రెండు పెగ్గులు, మూడు బజ్జీల మాదిరి సాగిపోతుంది. ఇంతలో ఏడాది క్రితం అమృత్ పాల్‌కు సందీప్ కౌర్ అనే యువతితో వివాహమైంది. అప్పటి నుంచి అతను మద్యం తాగడం మానేశాడు. తాగబోతు స్నేహితులతో కలిస్తే మళ్లీ తాగడం నేర్పిస్తారని స్నేహితులను కలవడం కూడా మానేశాడు. అమృత్ పాల్‌లో వచ్చిన మార్పు స్నేహితులకు నచ్చలేదు. మందు మానేయడమే కాకుండా తమతో దోస్తీ కట్ చేసుకుంటాడా అని అతనిపై కక్షగట్టారు.

స్నేహితులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ ఇంటికి వెళ్లిమరీ అతణ్ని చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, ఇతర కుటుంబసభ్యులను కూడా కొట్టారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీల్లో రికార్డైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.