డ్రగ్స్ కేసు విషయంలో పూరితో మొదలైన విచారణ.. వరుసగా శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ తో కొనసాగింది, అయితే ఈకేసులో ఉన్న మరికొంతమంది సినీ ప్రముఖులను సిట్ విచారించనుంది,ఈ కేసుతో సంబంధం ఉన్న ఆడవాళ్లను.. వాళ్లు కోరుకున్న స్ధలంలోనే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.అయితే ఛార్మి తను నాంపల్లిలో ఉన్న సిట్ ఆఫీసుకే వస్తానని.. అందరిలాగే తనను కూడా అక్కడే విచారించాలని చెప్పినట్లు సమాచారం.అయితే సోమవారంనాడు నవదీప్ ను విచారించి ,ఈనెల 26 న ఛార్మీని విచారించనున్నారు సిట్ అధికారులు.అయితే చార్మీ నటించిన జ్యోతిలక్ష్మి సినిమా వేడుకల్లోనే కాకుండా, ఆమె జన్మదిన వేడుకల్లోనూ డ్రగ్స్ ను సప్లై చేసే కెల్విన్ కనిపించడం కీలకంగా మారింది. దీంతో చార్మీ విచారణ తర్వాత డ్రగ్స్ కేసు విషయంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు.