17న బీజేపీలోకి  డీఎస్ తనయుడు - MicTv.in - Telugu News
mictv telugu

17న బీజేపీలోకి  డీఎస్ తనయుడు

September 9, 2017

టీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీ డీ.శ్రీనివాస్‌ రెండో కుమారుడు  ధర్మపురి అరవింద్‌ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయన ఈ నెల 17న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో కాషాయదళ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోది. అరవింద్ శనివారం కాషాయ దళం నేతలతో సమావేశమయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, రాంలాల్‌ లను ఆయన కలుసుకుని చర్చలు జరిపారు. అయితే ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు.

అరవింద్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అరవింద్ పంద్రాగస్టున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా ఓ జాతీయ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన కలకలం సృష్టించింది. తన కొడుకు బీజేపీలో చేరతారన్న వార్తలను డీఎస్ ఇటీవల తోసిపుచ్చారు. అయితే తన కొడుకులు తన మాట వినడం లేదని కూడా ఆయన వాపోయారు. తాను మాత్రం ఆర్‌ఎస్‌లోనే ఉంటానని, పార్టీని విడిచిపోనని తేల్చి చెంప్పారు.