దుబాయ్ సాహస ప్రియులకు అడ్డా అని చెప్పొచ్చు. ఇప్పడు అర్ద్ ఆర్కిటెక్చర్ సంస్థ ది ఫ్లోటింగ్ రిట్రీట్ పేరుతో సరికొత్త హోటల్ ని ప్రారంభించనుంది.
థ్రిల్ కోరుకునే వారికి దుబాయ్ కేంద్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అక్కడ స్కైడైవింగ్ ప్రధాన ఆకర్షణ. విమానం నుంచి దూకి ఎడారి నగరం, పక్షుల వీక్షణను ఆస్వాదించవచ్చు. శాండ్ బోర్డింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్.. ఇవి కాకుండా రాక్ క్లైంబింగ్, డూన్ బాషింగ్.. అబ్బో ఇలా చాలా అడ్వెంచర్ కోసం ఎన్నో ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. ఇసుక దిబ్బల మీదుగా రైడ్ మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.
సరికొత్తగా..
ఇన్ని సాహాసాల నడుమ మరో సాహసయాత్రకు సిద్ధంగా కావాలంటుంది దుబాయ్ నగరం. రెండు పర్వతాల మధ్య తేలియాడే గుడారాలను నిర్మించబోతున్నది. నిజంగా.. ఇది రియాలిటీ కాబోతున్నది. షార్జా పర్వతశ్రేణిలో దీన్ని నిర్మించబోతున్నది. గుడారాలలో ఒకదానిని తిరోగమనంలో ఉంచారు. ఇది ఎలివేటర్ గా పనిచేస్తుంది. పర్వతాల మధ్య ప్రాంతాన్ని విస్తరించి ఉన్న ప్లాట్ ఫారమ్ కు వాటిని రవాణా చేస్తుంది. ప్లాట్ ఫారమ్ పైకి వచ్చిన తర్వాత అతిథులు వారి వ్యక్తిగత గుడారాలను యాక్సెస్ చేయవచ్చు. ఇది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వసతి కల్పిస్తుంది.
ఏకాంతం కోసం..
పర్వతాల మీద కాబట్టి గాలి బాగా వీస్తుంది. కాబట్టి దీన్ని నియంత్రించుకునేలా గుడారం లోపల సవరించి ఉంటాయి. అలాగే ఏకాంతం కోసమే వీటి నిర్మాణం చేపట్టినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇది మొదటి అడ్వెంచర్ హాస్పిటాలిటీ ప్రయత్నం. అందుకే డిజైన్ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను పెంచుతుంది. అందుకే హోటల్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంటారు. గుడారాలకు భద్రతా చర్యగా ట్విన్ సస్పెండ్ తాళ్లు కూడా ఉంటాయి. ఈ వైర్లు వారిని పర్వతం అంచుకు స్వింగ్ అయ్యేలా ఉంటాయి. ఈ హోటల్ లో ఇతర సేవలు అంటే.. స్పా, రెస్టారెంట్, ప్రైవేట్ గైడెడ్ పర్వత ప్రయాణాలతో కూడిన గ్రౌండ్ లెవల్ రిసెప్షన్ ప్రాంతం కూడా ఉన్నాయి.