కరడుగట్టిన ఆంక్షలు అమల్లో ఉండే గల్ఫ్ దేశాల్లో క్రమంగా మార్పొస్తోంది. స్త్రీలకు డ్రైవింగ్ లైసెన్స్ వంటి సంస్కరణలు మొదలయ్యాయి. చమురు నిల్వలు దండిగా ఉండడంతో ప్రజలకు పన్నుపోట్లను కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా యూఏఈలోని దుబాయ్ ప్రభుత్వం మందుబాబులకు పెద్ద ఊరట కల్పించింది. మద్యంపై పన్నును పూర్తిగా రద్దు చేసింది. లిక్కర్ లైసెన్స్ ఫీజును కూడా తీసేసింది. పర్యాటకులను మరింతగా ఆర్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దుబాయ్లో మద్యంపై 30 శాతం పన్ను ఉంది. ఇది రద్దు కానుండడంతో ఆదాయం భారీగా పడిపోనున్నా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం వల్ల పూడ్చుకోవచ్చన్నది ప్రభుత్వ యోచన. ఇస్లాం ప్రకారం మద్యపానం నిషిద్ధమయినా చాలా మంది దాన్ని పట్టిచుకోవడం లేదు. దీంతో ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెలలోనూ మద్య విక్రయాలకు దుబాయ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.