Dubai Government Invites Vijay Devarakonda For MMA Championship
mictv telugu

విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం.. మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ గా రికార్డు

October 24, 2022

గత కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు రౌడీ విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ వంటి వరుస ఫ్లాప్స్ తరువాత భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సైతం డిజాస్టర్ అయింది. అంతే విజయ్ పై విపరీతమైన ట్రోల్స్. పని అయిపోయిందని, పొగరు తగ్గించుకోవాలని తెగ విమర్శించారు. దాంతో డీలా పడ్డ రౌడీ ఫాన్స్ కి ఒక మంచి శుభవార్త.

దుబాయిలో నిర్వహించి ఎంఎంఏ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీలకు దుబాయ్ ప్రభుత్వం విజయ్ దేవరకొండను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని అందుకున్న మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ గా విజయ్ దేవరకొండ నిలిచాడు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత విజయ్ దేవరకొండకి కూడా ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. స్టార్ బాలీవుడ్ హీరోలని కాకుండా ఈ అరుదైన అవకాశం తనకి దక్కటం రౌడీ బాయ్ కి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. సౌత్ అండ్ నార్త్ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోలని వెతికిన క్రమంలో.. రణవీర్ సింగ్, దుల్కర్ సల్మాన్ లా పేర్లు కూడా పరిశీలించారట నిర్వాహకులు. అయితే వీరిద్దరిని పక్కనపెట్టి విజయ దేవరకొండకి అవకాశం దక్కటం గమనార్హం. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న జనగణమన సినిమా ఆగిపోయింది అనే టాక్ ఉండగా.. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ రౌడీ హీరో.