ఆ నేరస్తుల కుటుంబాల్లో పండగే!  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నేరస్తుల కుటుంబాల్లో పండగే! 

August 30, 2017

రూల్స్ అనేవి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. దుబాయ్ లో అయితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. దుబాయ్ రాజు పరిపాలనలో చిన్న చిన్న తప్పులకు కూడా అక్కడ  కఠిన శిక్షలు విధిస్తారు. భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ బహిరంగ ప్రదేశాల్లో బుగ్గల మీద లేదా పెదాల మీద ముద్దు పెట్టుకోకూడదనే నియమం ఉందక్కడ.  అలా ముద్దాడిన వారికి ఒక ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది.

శిక్షల విషయంలో అంత కఠినంగా ఉండే దుబాయ్ రాజు ఇపుడు తన గొప్ప మనసు చాటుకున్నాడు. బక్రీద్ పండుగ సందర్బంగా 543 మంది నేరస్థులకు క్షమాభిక్ష  పెడుతున్నట్టు ప్రకటించారు. రంజాన్, బక్రీద్.. వంటి ముస్లిం పర్వదినాల సందర్భంగా దుబాయ్ రాజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. దీనిలో  భాగంగా ఈ సారి ఖైదీలను కరుణించాడు.  

నిర్ణయంతో 543 నేరస్థుల కుటుంబాల్లో  ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఇలా విడుదలయిన ఖైదీలు.. మళ్లీ నేరాలు చేసినట్లు తెలిస్తే కఠిన శిక్షలు ఉంటాయనీ రాజు వార్నింగ్ కూడా ఇచ్చాడు.  విడుదల కాబోతున్న నేరస్ధులు  ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అన్ని విదాలా  సాయం చేస్తుందని భరోసా కూడా ఇచ్చాడు. .