రోబోలు కాఫీలు, టీలు తెచ్చి ఇవ్వడం మామూలే! కానీ ఈ రోబోలు అచ్చం మనుషుల్లా కనిపిస్తాయి. మాట్లాడుతాయి, కథలు కూడా చెబుతాయి. ఇలాంటి రోబోలతో దుబాయ్ లో ఒక కేఫ్ త్వరలో ప్రారంభం కానుంది.సాంకేతికంగా ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ కాలంలో మానవులు, రోబోలతో భర్తీ చేస్తున్నారు. కర్మాగారాల్లోనే కాదు.. చాలా చోట్ల రోబోలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు రోబోలు కేప్ లు, కార్యాలయాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక కేఫ్ లో రోబ ఉండడం కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పటికే చాలా రోబోలు ప్రపంచవ్యాప్తంగా కేఫ్ లను నడిపిస్తున్నాయి. కాకపోతే ఈ రోబో కొంత స్పెషల్. ఎందుకంటే.. ఇది అచ్చు మనిషిని పోలికలతో ఉంటుంది.
దుబాయ్ లో..
ప్రపంచంలో కొత్తగా సృష్టించే ప్రయత్నంలో మనుషులు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ సూపర్ మోడల్’ కేఫ్ ను దుబాయ్ లో త్వరలో ప్రారంభించబోతున్నది. డోనా సైబర్ కేఫ్ 2023లో తెరవడానికి సిద్ధంగా ఉంది. ఈ కేఫ్ 24 గంటలు తెరిచి ఉంటుంది. ఈ కేఫ్ లు కస్టమర్లకు సర్వ్ చేయడంతో పాటు, అనేక ఐస్ క్రీమ్ లను కూడా తయారుచేస్తుంది.
కథలు చెప్పేలా..
మొదటి డోనా సైబర్ కేఫ్ అనేది ఇంకా తెలియనప్పటికీ, సమీప భవిష్యత్తులో మాత్రం మరిన్ని రోబోలను తయారుచేస్తారు. సూపర్ మోడల్ రోబో భాగాలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రోబోట్ కూడా కొద్దిగా వ్యంగ్యంగా ప్రోగ్రామ్ చేయబడింది. అదనంగా రోబోలు కస్టమర్లను గుర్తుంచుకోవడానికి, కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని కూడా దీంట్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇవికాకుండా.. కేఫ్ లోని కస్టమర్లందరితో మాట్లాడేలా, కథలు చెప్పగలవు.