దుబ్బాక అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు 

October 16, 2020

దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. ఒక ల్యాండ్ విషయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు అయింది. ల్యాండ్ ఇష్యూని సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడినట్లు కార్తీక, ఆమె అనుచరులపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అమీన్‌పూర్ వద్ద ఉన్న 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తిక మధ్యవర్తిత్వం చేశారని బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన వద్ద కార్తీక, ఆమె అనుచరులు కోటి రూపాయల నగదును సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు. తన డబ్బులను కార్తీక నుంచి తిరిగి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. ఈ కేసుపై కార్తీక ఇంతవరకు స్పందించలేదు. కాగా, సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.