టీఆర్ఎస్‌ను మల్లన్న సాగర్ ముంచిందా?  - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌ను మల్లన్న సాగర్ ముంచిందా? 

November 10, 2020

Dubbaka assembly elections reasons for Trs defeat

దుబ్బాక ఉప న్నికల్లో గట్టి పోటీ ఉన్నా అధికార టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో రాజకీయ వర్గాలు పోస్ట్ మార్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏమాత్రం సత్తా చాటదని, పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్‌‌ల మధ్యే ఉంటుందని చేసిన విశ్లేషణలు నిజం కాలేదు. హస్తం 21,961 ఓట్లు సాధించింది. దీంతో టీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు బయటపడుతున్నాయి. 

అభ్యర్థి ఎంపికపై అంసతృప్తి, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల వ్యవహారం, శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం టీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సోలిపేట సుజాతకు సానుభూతితో, తన ప్రభుత్వ పథకాల వల్ల భారీగా ఓట్లు పడతాయన్న గులాబీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. సుజాత బలహీన అభ్యర్థి కావడంతోపాటు, కుమారుడిపై ఆరోపణలతో దుబ్బాక ప్రజలు ఆమెను స్వీకరించలేకపోయారు. 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్య కూడా టీఆర్ఎస్ ఆశలకు గండికొట్టింది. తక్కువ పరిహారం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎక్కవ పరిహారం ఇచ్చి, తమను నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు దీన్ని ఆయుధాలుగా వాడుకున్నాయి. మరోపక్క.. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు దూకుడు ప్రదర్శించడం, యువత ఆయనవైపు మళ్లడం, సోషల్ మీడియాలో విపరీత ప్రచారం వల్ల కూడా గాలి గులాబీవైపు కాకుండా కమలంపైపు వీచింది.