దుబ్బాకలో టీఆర్ఎస్ పైచేయి.. టెన్షన్, టెన్షన్  - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాకలో టీఆర్ఎస్ పైచేయి.. టెన్షన్, టెన్షన్ 

November 10, 2020

bjp

నరాలు తెగిపోయే ఉత్కంఠ నడుమ టీఆర్ఎస్ కారు జోరుగా సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీని వెనక్కినట్టి స్వల్ప మెజారిటీతో ముందుకెళ్లింది. చివరి రౌండ్లలో తీవ్ర ఆధిక్యం కనబరుస్తోంది. 19వ రౌండ్ ఫలితాల తర్వాత  టీఆర్ఎస్‌కు 53,053 ఓట్లు, బీజేపీ 53,802 ఓట్లు దక్కాయి. బ్యాలెట్ ఓట్లలో అత్యధికం గులాబీ జెండాకే పడ్డాయి. కాంగ్రెస్ కూడా బాగానే ఓట్లు దక్కిచుకుంది. 18వేల ఓట్లు పైచిలుకుతో మూడో స్థానంలో ఉంది. మొత్తం 23 రౌండ్లలో మిగిలిన నాలుగు రౌండ్ల ఫలితాలు మరో గంటలో రానున్నాయి. గులాబీ కారు బీజేపీని వెనక్కి నెట్టేయడంతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

మరోపక్క.. బిహార్ బీజేపీ, జేడీయూల ఎన్డీఏ 127 స్థానాల్లో ఆధిక్యంల కొనసాగుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి 105 స్థానాల్లో మెజారిటీ సాధించింది.