నేడు దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యుల్ ఖరారు... - MicTv.in - Telugu News
mictv telugu

నేడు దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యుల్ ఖరారు…

September 25, 2020

hmnghvmn

ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు కానుంది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక ఉప ఎన్నిక జరుగనుంది. బీహార్ ఎన్నికల తేదీల ప్రకటనకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలోని ఆఫీస్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనుంది. 

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరపడం ఇదే తొలిసారి. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబరు 29వతేదీతో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో బీహార్‌లో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మేనిఫెస్టోల తయారీపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ఖరారు అయితే బీహార్, దుబ్బాకలో ఎలెక్షన్ కోడ్ అమల్లోకి రానుంది.