దుబ్బాకలో బీజేపీ గెలుపు.. - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాకలో బీజేపీ గెలుపు..

November 10, 2020

Dubbaka elctiion results

ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 23 రౌండ్లలో చివరి నాలుగు రౌండ్లు ఆయన విజయాన్ని సుగమం చేశాయి. రఘునందన్ 1470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. రఘునందన్‌ 62,773 ఓట్లు, సుజాత 61,302 ఓట్లు సాధించారు. 21,964 ఓట్లతో కాంగ్రెస్ కూడా సత్తా చాటుకుని మూడో స్థానంలో నిలిచింది. 

తొలి పది రౌండ్లతో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యంతో సాగడంతో ఆ పార్టీనే గెలుస్తుదని అందరూ భావించారు. తర్వాత రౌండ్లో మెజారిటీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య దోబూచులాడ్డంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. 20,21,22,23 రౌండ్స్‌లో బీజేపీ పుంజుకొంది.  23వ రౌండ్‌లో కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో మరింత సస్పెన్స్ నెలకొంది. అయితే బీజేపీ అప్పటికే వెయ్యికిపైగా ఓట్ల మెజారిటీలో ఉండడంతో కమలనాథులు గెలుపు తమదేనని సంబరాలు చేసుకున్నారు.