దుబ్బాక దంగల్..  టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ.. కాషాయానికి లీడ్ - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక దంగల్..  టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ.. కాషాయానికి లీడ్

November 10, 2020

Dubbaka Election results

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల కౌంటింగ్ ఫలితాలు టీఆర్ఎస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. బీజేపీ స్వల్ప ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ పైచేయి ప్రదర్శిస్తున్నా అది కూడా  తక్కువగా ఉండడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ వార్త రాసే సమయానికి బీజేపీకి 34,748 ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్ 30,815 వచ్చాయి. దాదాపు 4 వేల ఓట్ల మెజారిటీ కాషాయం ముందుకు సాగుతోంది. మొత్తం 23 రౌండ్లలో 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. తుది ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూద్దామని అంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 198756 ఓట్లు ఉండగా..1,64,192 ఓట్లు పోలయ్యాయి. 82 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 

కాంగ్రెస్ 6 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి కారణంగా ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ తరఫున ఆయన భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస రెడ్డి పోటీపడ్డారు.