సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగు వ్యక్తి శ్రీనివాస మూర్తి నిన్న శుక్రవారం కన్నుమూశారు. శ్రీనివాస మూర్తి చాలా మంది ప్రముఖ నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేయగా.. తమిళ హీరో సూర్య చిత్రాలతో ఫెమస్ అయ్యారు. సినీ ప్రపంచంలో సుదీర్ఘమైన కెరీర్‌ను కలిగి ఉన్న శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, తన ప్రత్యేకమైన స్వరంతో త్వరగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో శ్రీనివాస మూర్తికి, ఆయన నైపుణ్యానికి ప్రత్యేక గౌరవం ఉంది.
దాంతో శ్రీనివాస మూర్తి మరణ వార్త చిత్ర పరిశ్రమకి విషాదం మిగిల్చింది. చాలామంది తెలుగు స్టార్స్ ఆయనకి సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస మూర్తితో కలిసి చాలా సినిమాలకి పనిచేసిన తమిళ స్టార్ హీరో సూర్య సైతం తీవ్ర సంతాపాన్ని తెలియ చేశాడు.
శ్రీనివాస మూర్తి మరణం తనకు వ్యక్తిగత నష్టం అని కామెంట్స్ చేశాడు సూర్య. అయితే తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతిలో చిన్న ట్విస్ట్ బయటపడింది. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండె పోటు కారణంగా తుది శ్వాస విడిచారని అందరు అనుకున్నారు. కానీ ఆయనకీ గుండెపోటు రాకముందే మరొక ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. మరణానికి ముందు ఆయన తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. కిందపడిన వెంటనే ఆయన హార్ట్ ఎటాక్‌కు గురయ్యారట. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించినా వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు.
ఇవి కూడా చదవండి :
నన్ను వేధించొద్దు.. తొలిసారి స్పందించిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్..!
విలేకరిపై త్రివిక్రమ్ ఫ్రెండ్ నాగవంశీ సూపర్ కౌంటర్..!