పెళ్ళై బిడ్డపుట్టినా.. బ్రిటన్ యువరాణికి దక్కని పౌరసత్వం - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్ళై బిడ్డపుట్టినా.. బ్రిటన్ యువరాణికి దక్కని పౌరసత్వం

November 18, 2019

citizenship..

డచెస్‌ ఆఫ్‌ సస్సెక్స్‌, బ్రిటన్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ హారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. బ్రిటన్ యువరాణి అయిన మేఘన్‌కు బ్రిటన్‌ పౌరసత్వం ఇంకా లభించలేదు. దరఖాస్తు చేసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆమె ప్రతిపాదన ఇంకా అధికారికంగా అంగీకరించలేదు. ఆమె బ్రిటన్‌ యువరాణి అయినప్పటికీ ఇంకా బ్రిటిష్‌ పౌరురాలు కాలేకపోయింది.

హాలీవుడ్ నటి అయిన మేఘన్ 2018 మార్చిలో యువరాజు హారీని వివాహం చేసుకున్నారు.  వీరికి ఓ కొడుకు సంతానం. ”మహారాణి ఎలిజబెత్ మనుమడు ప్రిన్స్‌ హారీతో మేఘన్ వివాహం జరిగి 18 నెలలు కావస్తున్నా ఆమెకు ఇంకా బ్రిటన్ పౌరసత్వం లభించలేదు. ఈ విషయం కొంత అసాధారణంగానే ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ కాస్త ఆలస్యంగానే నడుస్తోంది.” అని మేఘన్‌ స్నేహితురాలు ఒకరు ఇటీవల మీడియాకు తెలిపారు. త్వరలో మేఘన్ బ్రిటన్ పౌరసత్వం అందుకోనున్నారని ఆమె వెల్లడించారు. ఈ ఆలస్యం వల్ల డిసెంబరు 12న జరుగనున్న బ్రిటన్‌ సాధారణ ఎన్నికల్లో యువరాణి మేఘన్‌ ఓటు వేయలేరు. బ్రిటన్‌ రాజ కుటుంబీకులు ఎన్నికలలో ఓటు వేయడానికి అనుమతి ఉన్నా.. వారు ఓటు వేయకపోవడమే సంప్రదాయంగా వస్తోంది.