చేప,బాతు స్నేహం.. వైరల్ అవుతున్న వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

చేప,బాతు స్నేహం.. వైరల్ అవుతున్న వీడియో

January 16, 2020

Duck

స్నేహానికి ఎటువంటి హద్దులు లేవని నిరూపించింది ఓ బాతు. ఆహారం కోసం అలమటిస్తున్న చేపలను చూసి స్వయంగా తన నోటితో అందిస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఢిల్లీలోని ఓ పార్కులో ఇలా ఆహారాన్ని అందిస్తూ బాతు కెమెరాకు చిక్కింది. దీన్ని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కశ్వాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు వీటి స్నేహాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. 

ఈ వీడియోలో నీటిలోని చేప ఆహారం కోసం వెతుకుతోన్న సమయంలో అక్కడే ఉన్న ఓ బాతు ట్రేలోంచి ధాన్యాలను నోటితో తీసి చేపకు అందించింది. అవి తమ ఆకలి తీర్చుకునేంతసేపు బాతు ధాన్యాన్ని అందించింది. నీటిలో ఎప్పుడూ కలిసి తిరిగే ఈ బాతు, చేపల స్నేహం అందరిని ఆలోచనలో పడేసింది. సాయం చేయాలనే గుణం మనుషులే కాదు జంతువులు పక్షుల్లో కూడా ఉందని మరోసారి నిరూపించాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.