ఈ బొమ్మను సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీరు పప్పే! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ బొమ్మను సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీరు పప్పే!

March 7, 2018

ఈ బొమ్మను జాగ్రత్తగా గమనించండి. ఏముందో చెప్పండి? అని అడిగితే ఏం సమాధానాలు వస్తాయి? ఆ.. ఇదేమంత పెద్ద పరీక్ష? అది కుందేలు కదా మాకు తెలుసులే.. అని కొందరు చెబుతారు. మరికొందరేమో ఆ.. కాదు, కాదు అది బాతు అని అంటారు. కానీ ఇలా బాతు అనో లేకపోతే కుందేలు అనో ఏదో ఒకదాని పేరు మాత్రమే చెబితే మిమ్మల్ని జనం ఈజీగా బుట్టలో వేసుకుంటారట! కనుక మళ్లీ జాగ్రత్తగా గమనించండి.  

ఆల్బర్టా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త కైల్ మాత్యూసన్ పరిశోధనలో ఈ బొమ్మపై పలు విషయాలు వెల్లడయ్యాయి. ఈ బొమ్మలో కుందేలుతోపాటు బాతు కూడా ఉందని చెప్పేవాళ్లు చాలా తెలివిమంతులని, వాళ్లు ఆలోచనా పరిధి పెద్దదని  వెల్లడైంది. ‘డక్ ఆర్ ర్యాబిట్’ ఇల్యూజన్ టెస్ట్‌లో చూపే ఈ బొమ్మపై కైల్ అధ్యయనం చేశారు.

సందర్భమేదో చెప్పకుండా రెండు అంశాలున్న ఒక విషయాన్ని మీ ముందు ఉంచినప్పుడు అర్థం చేసుకోవడానికి మన మెదడు ఇబ్బంది పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. కుందేలును మాత్రమే లేకపోతే బాతును మాత్రమే చూసే వారు తప్పుడు వార్తలను సులభంగా నమ్మేస్తారని, ఆలోచన ఒక పరిధి దాటి ఎదగకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అన్నారు.