క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు.. అందరూ డకౌట్.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు.. అందరూ డకౌట్..

May 17, 2019

Duck tales Kasargod U-19 girls all bowled out without scoring.

క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. బ్యాటింగ్ దిగిన జట్టు ప్లేయర్లంతా.. ఒకరివెనక ఒకరూ ఒక్క పరుగు కూడా చేయకుండా.. జట్టులో ఉండే పదిమంది డకౌట్ అయ్యారు. కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుధవారం కేరళలోని మలప్పురం జిల్లా పెరింథల్‌మన్న స్డేడియంలో వాయనాడ్, కాసరగోడ్ మహిళల జట్ల మధ్య అండర్‌-19 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కాసరగాడ్‌ జట్టు.. ఓపెనర్లు వీక్షీత, చైత్ర రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. ఒక్క పరుగు కూడా చేయలేదు. కాగా మూడో ఓవర్ల నుంచి కాసరగోడ్‌ ఒకరి వెంట ఒకరు పెవీలియన్ బాట పట్టారు.

మూడో ఓవర్లో వేసిన వాయనాడ్ కెప్టెన్ నిత్య లూర్ద్ మూడు వికెట్లు తీయగా.. ఆ తర్వాత ఓవర్లో కాసరగోడ్‌ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయింది. మరో బౌలర్‌ జోషిత ఐదు బంతుల్లో హ్యాట్రిక్‌ తీసి మొత్తం 4 వికెట్లు తీసింది. జట్టులోని 10 మంది బ్యాటర్లు డౌకట్ అయ్యారు. నాటౌట్‌గా నిలిచిన 11వ బ్యాటర్ ఖాతా తెరవలేదు. వయనాడ్ బౌలర్లు నాలుగు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చారు. దీంతో కాసరగోడ్ 5 పరుగుల లక్ష్యాన్నిమాత్రమే నిర్దేశించింది. 5 పరుగల లక్ష్యాన్ని వయనాడ్ జట్టు మొదటి ఓవర్లోనే సాధించింది.

 

Duck tales Kasargod U-19 girls all bowled out without scoring.