లాక్ డౌన్ ఎఫెక్ట్...గంగా న‌ది త‌ళ‌త‌ళ‌ - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్…గంగా న‌ది త‌ళ‌త‌ళ‌

April 5, 2020

due to Coronavirus Lockdown Health Of River Ganga Improves

కరోనా వైరస్ వల్ల జరుగుతోన్న ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాన్ని పక్కనబెడిఐతే.. ఈ మహమ్మారి వల్ల భూగోళానికి కొన్ని లాభాలు కూడా జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పరిశ్రమలు, ఆఫీసులు మూతపడ్డాయి. దీంతో భూగోళంపై వాయు, శబ్ద, నీటి కాలుష్యాలు తగ్గుముఖం పట్టాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్ లో కూడా లాక్‌డౌన్ సత్ఫాలితాలను ఇస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వ‌ద్ద తోలు ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసి వేశారు. దీంతో అక్క‌డ గంగా న‌ది నీరు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది. సాధార‌ణంగా గంగా న‌దిలో తోలు పరిశ్రమల మ‌లినాలు వ‌చ్చి చేరేవి. ఇప్పుడు ఆ కాలుష్యం త‌గ్గ‌డంతో త‌ళ‌త‌ళ‌లాడుతూ గంగా న‌ది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న‌ది. ప‌విత్ర‌ గంగా న‌ది నీటి నాణ్య‌తో సుమారు 50 శాతం పెరిగిన‌ట్లు బెన‌రాస్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ పీకే మిశ్రా తెలిపారు.