గత ప్రభుత్వం అమలు చేసిన దుల్హన్ అనే సంక్షేమ పథకాన్ని నిలిపివేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువవడంతో పథకాన్ని కొనసాగించలేకపోయామని నివేదికలో పేర్కొంది. టీడీపీ హయాంలో మొదలైన ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. మైనార్టీ వర్గాల్లోని పేదింటి ఆడ పిల్లల వివాహానికి ఆర్ధిక సహాయం చేయడానికి ఉద్దేశించినది. ఈ పథకం కింద రూ. 50 వేల నగదును వధువు కుటుంబానికి అందేవి. దుల్హన్ పథకాన్ని నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణ సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని నివేదించింది.