మహానటితో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు సీతారామంతో అందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన దుల్కర్ పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు నెట్టింట కామెంట్ల వరద ముంచెత్తుతుంది.
దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు ముమ్ముట్టి కొడుకుగా అందరికీ పరిచయమయ్యాడు. మలయాళంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ తెలుగులో కూడా తన దైన మార్క్ వేశాడు. సినిమాల్లోకి రాకముందే 22 డిసెంబర్ 2011లో అమల్ సోఫియాతో వివాహం అయింది. 2017లో కూతురు పుట్టింది. అయితే ఒకరోజు ఆలస్యంగా వారి వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన పోస్ట్ ని షేర్ చేశాడు దుల్కర్.
ఇన్ స్టాలో చేసిన పోస్ట్ ఏంటంటే.. ‘చాలా ఆలస్యమైన పోస్ట్! కానీ ఈ రోజు క్రేజీగా ఉంది. ఇప్పుడు వార్షికోత్సవం కాకపోయినా కూడా.. అది వార్షికోత్సవమే!
పదకొండు సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్! సమయం ఎక్కడికి పోయిందో తెలియదు. నా గడ్డం బూడిద రంగులో మారినప్పుడా? లేదా నువ్వు స్కూల్ తల్లుల గ్రూప్ లో చేరినప్పుడా? లేదా మనం స్వంత ఇల్లు కొన్నప్పుడు అనుకుంటా కదా! ఈ మైలు రాళ్లను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఒకప్పటి కథలా అనిపించాయి. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మన స్వంతంగా నిలబడ్డాం.
ప్రతీ సంవత్సరం లాగే ఈ పోస్ట్ ఆలస్యం అయింది. పేరెంటింగ్.. ఇతర కారణాలు కావచ్చు. ఇక్కడ మన కోసం ఈ పోస్ట్..’ అని రాసుకొచ్చాడు.
కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ, మృణాల్ ఠాకూర్, కల్యాణి ప్రియదర్శన్ వీరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇతర సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ వారికి వివాహ వార్షికోత్సవ అభినందనలు తెలియచేశారు. దుల్కర్ సీతారామం తర్వాత చుప్ సినిమాతో ముందుకొచ్చాడు. ఇందులో సైకోగా బాగా నటించడాని విమర్శకుల నుంచి సైతం అభినందనలు అందుకున్నాడు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ సంబంధించిన ఒక వెబ్ సిరీస్ లో దుల్కర్ కనిపించనున్నాడు.