dulquer salmaan is playing cm jagan mohan reddy charector in varma yatra 2 movie
mictv telugu

వర్మ ‘యాత్ర2’ సంచలనం.. సీఎం జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ?

November 7, 2022

dulquer salmaan is playing cm jagan mohan reddy charector in varma yatra 2 movie

ఆర్జీవీ ఇది పేరు కాదు బ్రాండ్. కొన్నేళ్లుగా ఒక్క హిట్ లేదు కానీ మీడియాలో వర్మ పేరు ఉండని రోజుండదు. నిజం కూడా భయపడేలా పచ్చి నిజాలని చెప్తుంటాడు వర్మ. ఈ ధైర్యానికి తోడు.. అపారమైన మేధస్సు రామ్ గోపాల్ వర్మకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. మనసు పెడితే క్లాసిక్స్ తీస్తాడని ఇప్పటికీ నిర్మాతలు వర్మతో సినిమాలు తీయటం ఆపటం లేదు. అలాంటి వర్మకు సీఎం జగన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడని వార్త. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో వర్మతో 40నిమిషాల లంచ్ మీట్ జరిగింది. ఈ భేటీ ఎందుకో ఇప్పటికి ఎవ్వరికి క్లారిటీ లేదు. ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన గ్యాప్ తొలగించడానికని కొందరు, సినిమా టికెట్స్ ని 25రూపాయలు చేయాలన్న ప్రతిపాదన గురించని మరికొందరు జగన్ వర్మల భేటీపై రకరకాల రూమర్స్ రాగ.. యాత్ర మూవీ సీక్వెల్ ‘యాత్ర2’ పనులని వర్మకి జగన్ అప్పగించారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

గతంలో ఏపీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా రూపొందగా.. ఇప్పుడు యాత్ర2 సినిమా వైఎస్ జగన్ పాదయాత్ర బ్యాక్ డ్రాప్‌గా రూపొందనున్నదని.. సీఎం జగన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించనున్నాడని సంచలన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాత్ర మూవీలో వైఎస్సార్ పాత్రని మలయాళ మెగాస్టార్ మమ్ముటి చేయగా.. యాత్ర2 లో వైఎస్సార్ కొడుకు జగన్ పాత్రని మమ్ముటి కొడుకు దుల్కర్ సల్మాన్ చేయనున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సౌత్ టు నార్త్ భారీ క్రేజున్న దుల్కర్ సల్మాన్ లాంటి గొప్ప నటుడు అయితేనే జగన్ పాత్రకి న్యాయం చేయగలడని.. అప్పుడు యాత్ర సీక్వెల్ ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయొచ్చని వర్మ జగన్ తో తాజాగా చెప్పినట్టు సమాచారం. మరి సీఎం జగన్ అయితే వర్మ ప్రపోజల్ పై స్పందిస్తూ.. ఆలోచిద్దామని అన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కాస్టింగ్ విషయంలో వర్మ లెక్క ఇప్పటివరకు తప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పాత్రలకి సరిగ్గా అలాంటి నటులనే ఎంపిక చేసిన వర్మ జగన్ పాత్రకి దుల్కర్ ని సజెస్ట్ చేయటం సూపర్ అంటున్నారు. ఇక జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వర్మ యాత్ర2 పనులు మొదలు పెట్టనున్నట్టు సమాచారం.