రైలు పట్టాలపై చెత్త వేస్తే  జేబులు గుల్లే - MicTv.in - Telugu News
mictv telugu

రైలు పట్టాలపై చెత్త వేస్తే  జేబులు గుల్లే

May 18, 2019

dumping on railway tracks to attract Rs 5,000 fine southern railway implementing pilot project.

స్వచ్ఛభారత్ లక్ష్యంగా రైల్వే శాఖ కూడా కొరడా ఝళిపించనుంచింది. రైల్వే స్టేషన్లలో రైలు పట్టాలపై చెత్తవేస్తే రూ. 5 వేల జరిమానా విధించనుంది. అంతేకాకుండా చెత్త తీవ్రతను బట్టి పెనాల్టీ మొత్తాన్ని పెంచేస్తారు. పలు  రైల్వే స్టేషన్లు అరటి తొక్క నుంచి మలమూత్రాల వరకు పేరుకుపోయి దుర్గంధంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టింది.

దీని కోసం రైల్వే శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మొదట దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద తమిళనాడులోని చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సహా 19 రైల్వేస్టేషన్లలో అమలు చేయనుంది. గిండి, చెన్నై బీచ్,  తిరుత్తణి, పెరంబూరు, జోలార్‌పేట, తాంబరం, చెంగ్పట్టు, అవడి, తిరువళ్లూరు, కాట్పాడి,, మాంబళం, గూడువాంజేరి, పెరుంగొళత్తూర్‌, సింగపెరుమాళ్‌కోయల్‌ స్టేషన్లు వీటిలో ఉన్నాయి. ఈ స్టేషన్లలో కేవలం చెత్త నియంత్రణతోపాటు మంచినీరు, పారిశుద్ధ్యం వంటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సూపర్ వైజర్‌ను కూడా నియమిస్తారు. చెత్త వేసిన వారిని పట్టుకుని జరిమానా కక్కిస్తారు. జరిమానా కట్టకపోతే  అరెస్ట కూడా చేసే అవకాశముంది.